హైదరాబాద్: ఇతర రాజకీయ పార్టీల నుంచి శాసనసభ్యులను తాను ఆకర్షిస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ మీడియా సృష్టేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఇతర రాజకీయ పార్టీల నుంచి కనీసం 20 మంది శాసనసభ్యులను తనకు మద్దతుగా సమీకరించుకోవాలని వైయస్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనానికి ఒత్తిడి పెరుగుతోందని వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తాకథనాలపై ముఖ్యమంత్రి గురువారం ఉదయం మీడియా ప్రతినిధుల వద్ద ఆ వ్యాఖ్య చేశారు.
కాగా, చిన్న పార్టీలు కాంగ్రెసులో విలీనం అయితే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి వీలవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఇతర పార్టీల శాసనసభ్యులను పార్టీకి మద్దతుగా కూడగట్టుకునే విషయంలో జిల్లా కాంగ్రెసు నాయకత్వాల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పుడు తనకు శాసనసభ్యులు కావాలని, జిల్లా స్థాయిల్లో సమస్యలుంటే పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి నచ్చజెప్పుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.