హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్విక్ గన్ మురగన్ పై రెడ్ల గుర్రు

By Staff
|
Google Oneindia TeluguNews

Rajendra Prasad
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన క్విక్ గన్ మురగన్ చిత్రంపై రెడ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహు భాషల్లో నిర్మితమైన ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విలన్ కు రెడ్డి పేరు పెట్టడాన్ని వారు అభ్యంతర పెడుతున్నారు. రెడ్లను కించపరిచే ఆ చిత్రంపై కత్తెర వేయాలని రెడ్డి పరివార్ పత్రిక సంపాదకుడు శ్రీనివాస్ రెడ్డి, ఓసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి సెన్సార్ బోర్డును డిమాండ్ చేస్తున్నారు.

రెడ్లను అవమానపరిచే చర్యను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సినిమా ప్రదర్సనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. రెడ్లకు చెడ్డపేరు తెచ్చేందుకే ఆ చర్యకు పాల్పడినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. విలన్ కు పెట్టడానికి రెడ్డి పేరు తప్ప మరోటి దొరకలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రను నాజర్ పోషించాడు. రాజేంద్ర ప్రసాద్ సరసన రంభ హీరోయిన్ గా నటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X