ఉత్తరాఖండ్ లో బిజెపికి మెజారిటీ

సోమవారం, సెప్టెంబర్ 14, 2009, 14:33 [IST]
BJP
డెహ్రాడూన్: అధికార బిజెపికి ఉత్తరాఖండ్ శాసనసభలో మెజారిటీ లభించింది. వికాస్ నగర్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. దీంతో ఉత్తరాఖండ్ శాసనసభలో 70 సీట్లు ఉండగా బిజెపి బలం 36 సీట్లకు పెరిగింది. బిజెపి అభ్యర్థి కులదీప్ కుమార్ తన సమీప కాంగ్రెసు అభ్యర్థఇ నవ్ ప్రభాత్ ను 596 ఓట్ల మెజారిటీతో ఓడించారు.
  Read:  In English 
ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లోని ఐదు సీట్లను కూడా బిజెపి కోల్పోయింది. దీంతో ఖండూరీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాక్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఉత్తరాఖండ్ శాసనసభలో బిజెపికి క్రాంతిదళ్ శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets