న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతకు నక్సలైట్ల నుంచి ఇంకా ముప్పు పొంచే ఉందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నారు. రాష్ట్రాల పోలీసు చీఫ్ లనుద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. దేశ భద్రతకు సంబంధించిన సవాళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు మరింతగా సిద్ధపడాలని, గతంలోని తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. సరిహద్దు వెలుపలి నుంచి సాగుతున్న ఉగ్రవాదాన్ని తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
లష్కరే తోయిబా, జైషే మహ్మద్ దేశంలో దాడులకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. సామాజిక చట్రంలో వచ్చిన మార్పుల వల్ల ఉల్ఫా బలహీనపడిందని ఆయన చెప్పారు. దేశంలోని కొండ ప్రాంతాల్లో అశాంతి నెలకొని ఉందని, అస్సాం తిరుగుబాటుదారులు ఆయుధాలను అప్పగించడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు.