సోనియాకు బెదిరింపు: ఒకరి అరెస్టు

శనివారం, సెప్టెంబర్ 26, 2009, 11:15 [IST]
Sonia Gandhi-Manmohan Singh
రాంచీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రిని పి.చిదంబరాలకు బెదిరింపు లేఖలు రాసిన వ్యక్తిని జార్ఖండ్ గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్ లోని లేతహార్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ధనంజయ్ కుమార్ మెహతాను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం చెప్పారు. ఈ ఏడాది జులై మెహతా బెదిరింపు లేఖలు రాశాడు.

సిపిఐ - మావోయిస్టు లెటర్ ప్యాడ్ ను ముద్రించి ఆ గ్రూప్ కమాండర్ అభయ్ జీ పేరు మీద అతను పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. పత్రికా ప్రకటన విడుదల చేసి పాలమావు ప్రాంతంలో ఐదు రోజుల సమ్మెకు అతను పిలుపునిచ్చాడు. ప్రధాని మన్మోహన్ కు, సోనియాకు రాజీవ్ గతే పడుతుందంటూ అతను పత్రికా ప్రకటన విడుదల చేశాడని పోలీసులు చెప్పారు. ఎందుకు అటువంటి లేఖలు, పత్రికా ప్రకటనలు విడుదల చేశాడనే విషయాన్ని కనుక్కోవడానికి మెహతాను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets