సిఎంలను మార్చరు: రోశయ్య

శనివారం, సెప్టెంబర్ 26, 2009, 10:06 [IST]
Rosaiah
విజయవాడ: ముఖ్యమంత్రి కె.రోశయ్య కుండ బద్దలు కొట్టారు. తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరుచూ ముఖ్యమంత్రులను మార్చబోరని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తద్వారా తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రిగా ఒకరికి అవకాశం ఇచ్చి తగిన సమయం ఇస్తారని, సమర్థత నిరూపించుకోకపోతే అప్పుడు ఆలోచిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఇచ్చినట్లేనా అని ప్రశ్నించగా తాను వచ్చి నెలే అయిందని చమత్కరించారు. అప్పుడే తాను అసమర్థుడినో, సమర్థుడినో చెప్పేది ఎలా అని ఆయన ప్రశ్నించారు. మీ వృత్తిలో లాగే తాను ఎడిటర్ ప్రమోషన్ ఇప్పుడే పొందానని ఆయన అన్నారు. మీ ఎడిటర్ పోస్టు తాత్కాలికమా, శాశ్వతమా అని అడిగితే ఎడిటర్ పోస్టు శాశ్వతంగా ఉండదని అన్నారు. జగన్ ను సిఎం చేయాలని కోరడంలో తనకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన అన్నారు. జగన్ సహజ నాయకత్వ లక్షణాలున్న నేత అని ఆయన అన్నారు.

తాను బలహీనుడ్ని, తన పరిపాలన బలహీనం కాదని ఆయన స్పష్టం చేశారు. తన బలమేమిటో తనకు ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కెవిపి రామచందర్ రావు గురించి తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మళ్లీ చెప్పడానికేమీ లేదని ఆయన అన్నారు. కెవిపి రాజ్యసభ సభ్యుడు అని, పార్టీలో కీలక నేత అని, కెవిపికి ఉన్న ప్రాముఖ్యం, గౌరవం కెవిపికి ఉన్నాయని ఆయన అన్నారు. కష్టమైనా, క్లిష్టమైనా వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమాలను ముందు తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. వైయస్ రాష్ట్రంలో, పార్టీలో ఓ వెలితి ఏర్పడిందని ఆయన అన్నారు. దీన్ని అధిగమించాల్సి ఉందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. జగన్ ఉత్సాహవంతుడు, యువకుడు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు, ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అధిష్ఠానం చూసుకుంటుందని రోశయ్య అన్నారు. తాను ప్రకటనలు ఇవ్వకుండగా అవసరం వచ్చినప్పుడు అధిష్ఠానానికే వివరిస్తానని ఆయన చెప్పారు. డిజిపి, ప్రధాన కార్యదర్శుల మార్పు ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.
User Comments
kishore 28 Sep 2009 02:28 am
please jagan ni CM cheyandi
కక్ 27 Sep 2009 09:50 pm
మా రోజా కి మంత్రి పదివి గురించి ఏమి ఆలోచించారు సోనియా జీ ?.
నిజమ్ 27 Sep 2009 08:37 pm
ఆంధ్రా ప్రజల ఆత్మ గౌరవమ్ అంటూ గౌరవ మర్యాదలు లేని వాళ్ళు రచ్చ కెక్కి రాష్ట్ర సుభాగ్యాన్ని నాశనం చేసే వాళ్లకి తిరిగి పాలనా వ్యవస్థ పోకుండా ఉండాలంటే జగన్ కి తప్పకుండా మన ఆంద్ర ముఖ్యమంత్రిగా పదవి ఇచ్చితిరాలి ...
వెంకటేష్ రెడ్డి 27 Sep 2009 04:06 am
చీఫ్ మినిస్టర్ గ రోశయ్య నీ 5 years వుంచితే తరువాత ఆంధ్ర లో కాంగ్రెస్ రాదూ
govinda 27 Sep 2009 01:57 am
జనాలకేమో లీడర్ కావాలి. డిల్లీకేమో తోత్తులయిన కుక్కలు కావాలి.
Rao 26 Sep 2009 11:41 pm
మీ అయ్య సి ఎం అయితే నీకు తెలిసుండేది. మీ అయ్య కనీసం కార్పొరేటర్ అయినా కూడా నీకు తెలిసుండేది. ఈ ప్రశ్నలు అడిగే వాడివి కాదు. రాజకీయాల్లో క్వాలిఫికేషన్స్ వుండవ్. వుండేదంతా పబ్లిక్ చరిష్మా సప్పోర్ట్. ఎవ్వని వెనక జనం వుంటారో వాడే లీడర్. డబ్బులిస్తే వచ్చే జనం కాదు. లీడర్ కోసం ప్రాణమిచ్చే ప్రాణం తీసే జనం. అటువంటి జనం వున్నవాడే లీడర్. ఇది వొక్క ఆంద్ర జనమే కాదు. ప్రపంచమంతా ఇదే సూత్రం. జన బలం వున్నవాడే నాయకుడు. జనం గొర్రెలు కాదు. వాళ్ళ లీడర్ ఎవరో వాళ్లకి తెలుసు. నీకు నాకు లీడర్ అవసరం లేదు. జనానికి కావాల
Sri 26 Sep 2009 09:06 pm
జగన్ తనను తను నేరుపించుకోవాలి, ఆ తరువాతే CM గుర్నిచి ఆలోచించలి. MP గా AP కు ఏదైనా సాదిన్చకే.... He has time and age to become CM.
గుడ్ keep it up 26 Sep 2009 08:58 pm
donga mundakodulaki gatti samadhanam cheppadu.
cbn 26 Sep 2009 07:13 pm
రోశయ్య హై కమాండ్ కి puppet, he is unfit and old
నిజం 27 Sep 2009 03:05 am
ఏమిరా ! YS గాడేమి తక్కువా ? వాడూ నెలకొకసారి ఢిల్లీ వెళ్లి సోనియా డి నాకే వాడు.
Rajesh 26 Sep 2009 07:02 pm
Repo Mapo poye nikendukura padavi vymoham…young generation ki iccheyyachuga
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets