తల వంచిన వైయస్ జగన్

మంగళవారం, సెప్టెంబర్ 29, 2009, 11:52 [IST]
YS Jagan
హైదరాబాద్: పార్టీ అధిష్టానానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తల వంచినట్లే కనిపిస్తున్నారు. ఖమ్మం, రాజమండ్రి సంఘటనలతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. తన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చి పెట్టింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెసు నాయకులు అధిష్ఠాన అంతరంగాన్ని గట్టిగా వినిపించారు. జగన్ పై మూకుమ్మడి దాడికి పాల్పడినట్లుగా ప్రకటనల వర్షం కురిపించారు. వి. హనుమంతరావు, కె.కేశవరావు, హర్ష కుమార్ వంటి నాయకులు జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్య వర్షం కురిపించారు. మరో వైపు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ లను జగన్ వర్గీయులు అడ్డుకోవడంపై కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఇదంతా జగన్ కు వ్యతిరేకంగా పని చేశాయని చెప్పవచ్చు. అధిష్ఠానం భావించిన దాని కన్నా ముందుగానే జగన్ దారికి రావడానికి ఆ సంఘటనలు ఉపయోగపడ్డాయి.

బెంగుళూర్ లో ఉన్న జగన్ అధిష్ఠానానికి తన విధేయతను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాము సోనియాకు విధేయులమని ఆయన చెప్పారు. ఖమ్మం సంఘటనను ఖండించారు. నల్లకాలువలో జరిగిన వైయస్ సంస్మరణ సభలో కాంగ్రెసు ప్రస్తావన గానీ, సోనియా ప్రస్తావన గానీ చేయకుండా ధిక్కార స్వరం వినిపించడానికి సిద్ధమైన జగన్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు ఒక్కరొక్కరే రోశయ్య నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతుండడం కూడా జగన్ ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. బెంగుళూర్ లో జగన్ ను కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ సోమవారం కలిశారు. రాష్ట్ర మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి కూడా కలిశారు. కెవిపి రామచందర్ రావు కూడా ఆయన వద్దకు వెళ్లారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ ) సమావేశంలో జగన్ వర్గీయులు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తారనేది మాత్రం ఇంకా గోప్యంగానే ఉందని చెప్పవచ్చు.
User Comments
సుధీర్ 14 Dec 2009 02:42 am
మిస్టర్ . జగన్ గారు, అధిస్తనానికి వెతిరేకంగ ఉండదు . ఐటి రైడ్ అవుతుంది .
అభిమాని 27 Jul 2010 04:33 pm
ని అబ్బ జగన్ ఎమైన రెండు ఎకరాల భూమితో వచ్చి రెండు వేల కోట్ల కి అధిపతి అయ్యాడు anukunnava
sriman 31 Oct 2009 12:55 am
వై.s. mohamchuci జనాలు votes vasaru . సోనియా maohamchucu ఎవ్వరు vayaladu selfish politics . ఛి. ఛి. chi. జగన్ wait and see.ముసలోడు కి heartattack will కం.
shekar 30 Oct 2009 09:27 pm
జగన్ సర్ నెక్స్ట్ టైం ట్రై చేసుకోండి ముందు ఆస్తులు kapadukondi
జగన్ 13 Oct 2009 04:07 pm
జగన్ అ ముసలోడు పదవి వదిలే పెట్టాడు ఇంకా నేకు ఎలా వస్తుంది ర బాబు, వణికే ఎన్నాలు పట్టిందే అ కుర్చీ లో కుర్చోవదనికే
చంద్రబాబు 11 Oct 2009 11:24 am
ఒరే మీ నాన్న చేసిన పాపాలు నిన్ను వదలవురా
Rosaiah 02 Oct 2009 03:33 am
Orey Jagan vanchina tala alage madichi ekkada kaali vunte akkada pettuko.. Next 5 years nene CM.. 2014 lo gelisthe appudu kooda nene CM .. nenu 2014 lo vodipothe appudu neeku chance.. so wait for that.. Pray god for that to happen..
Telugodu 02 Oct 2009 03:23 am
Orey Jaggada.. U have no other option .. Look at your father.. He was against high command and got nothing.. Once turned toward high command and pay cappam then he survived.. U tried to black mail, tried to play pride(hahah) cards.. nothing worked really.. so go and touch her feet so that u will get some space in congress and seat in next elections.. hahah ahahah ahahahah hahahah thoooo me bathuku cheda.. Nuvvu magadivi aithe ne pillalu iddaru neeke pudithe vere party pettara.. appudu chepu emin
JaganCM 30 Sep 2009 10:46 pm
Parandham, if we need to send Sonia to Italy and Rahul to GayLand, let us do that make Jagan Cm. Sonia can not come to AP without making Jagan CM or we all Jagan Sena community will teach her a lesson.
పరాందం రెడ్డి 30 Sep 2009 09:44 pm
గౌరవనీయులు జగన్ అన్న గారికి నమస్కారములు......! అన్న నా జీవితం లో నేను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిచినా , నా రియల్ హీరో “ వై. ఎస్. రాజశేకర రెడ్డి”. ఆయన లేరని తెలిసిన రోజు చెని పోవాలని అనుకున్న , కాని మిమ్మల్ని చూసిన తర్వాత బ్రతకాలని , మిమ్మల్ని "ముఖ్య మంత్రిగా " చూడాలని వున్నా..! నా కంఠం లో ప్రాణం వున్నంత వరకు మీకు తోడునై వుంటా... ! ప్రజా భలం లేని అధిష్టానం పెంపుడు కుక్కలు మీకు వ్యతి రేకం గా మొరుగు తున్నై... మీరు మాత్రం ఎటువంటి
jagan 01 Oct 2009 05:33 am
జగన్, నీకు సొంతంగా ఎలాగు బలం లేదు.కొంత మంది తిండి కి గతి లేని అమయికుల్ని వెంట వేసుకు తిరిగినంత మాత్రాన నువ్వో పెద్ద లీడర్ వయి పావి. నీ ౩ నెల్లల అనుభవానికీ నువ్వు ఇంత ఎగురుతుంతేయ్ మిగతా వాళ్ళేమన్నా గాజులు తోడుకున్నరనుకున్తున్నావా? మే అయ్యా ఎన్ని పాపాలు చేసి ఆ స్టేజి కోచి కుక్క చావూ చాచాడు. రేపు నే బతుకు అంతెయ్ అవుతుంది ఎలాగు, అల్ ది బెస్ట్. చూడక ఎక్కడికి పొతం చెప్పు.
To Above Reddy 02 Oct 2009 03:28 am
Orey ne address post chey nenu poison bottle pampisthaa thaagi YSR daggariki velli pooooooo.. elanti sollu comments rayaku..
గవరసాన సత్యనారాయణ 30 Sep 2009 04:58 pm
గౌరనీయులు జగన్ గార్కి రాజకీయ అనుభవము చాల తక్కువ. ముఖ్య మంత్రికి వచ్చే ముడుపులకోసం కాకపొతే మరొక ఐదు సంవత్సరాలు ఆగి ఎలెక్షన్లో నిలబడి తన సత్తా చూపించుకోవచ్చు. జగన్ గారు ఎందుకు తొందర పడుతున్నారు?
జగన్ 03 Oct 2009 02:15 pm
మరి సంపాదించిన అక్రమ ఆస్తుల్ని కాపాడుకోనేది ఎట్లా? ఇప్పుడు దొరికితే దొరికినట్లు,లేథంటే ఇంతే సంగతులు,న ఆస్తులు ముఖ్యం
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets