మంత్రాలయం మఠంలో 3 శవాలు

శనివారం, అక్టోబర్ 3, 2009, 12:43 [IST]
Mantralayam
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో మూడు మృతదేహాలు కనిపించాయి. వరద నీటికి మంత్రాలయం మఠం శుక్రవారం పూర్తిగా మునిగిపోయిన విషయం తెలిసిందే. మంత్రాలయంలో వరద తగ్గు ముఖం పట్టడంతో శనివారంనాడు మఠంలో మూడు మృతదేహాలు కనిపించాయి. ఇదిలావుంటే నాగులదిన్నెలో ఆరు మృతదేహాలు కనిపించాయి. మంత్రాలయంలో మూడు రోజులుగా విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పోలీసు స్టేషన్లలోని ఫోనులు కూడా పనిచేయడం లేదు. ప్రజలు అంధకారంలోనే రాత్రంతా గడిపారు.

ప్రజలు వరద తాకిడికి విలవిలలాడుతుంటే దోపిడీ దొంగలు మంత్రాలయంలో బీభత్సం సృష్టిస్తున్నారు. దొంగలు అందింది అందినట్లు దోచుకుపోతున్నారు. వరద భయంతో ఖాళీ చేసిన ఇళ్లలో, దుకాణాల్లో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets