ఇస్లామాబాద్: తమ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్, కోచ్ ఇంతికాబ్ ఆలంలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మంగళవారం వేటు వేసింది. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే ఆరోపణపై పిసిబి ఆ చర్యలు తీసుకుంది. వార్మప్ మ్యాచ్ లో గాయపడినప్పటికీ యూనిస్ ఖాన్ సెమీ ఫైనల్లో ఆడాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గ్రాంట్ ఇలియట్ ఇచ్చిన క్యాచ్ ను 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వదిలేశాడు. దీంతో ఇలియట్ అజేయంగా 75 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయానికి దోహదపడ్డాడు. ఇది తన జీవితాంతం కలచి వేస్తుందని, ఫలితం ఎలా ఉన్నప్పటికీ తాను ఆ క్యాచ్ ను వదిలేయాల్సింది కాదని యూనిస్ ఖాన్ అన్నాడు.
విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తాను విరిగిన వేలితో కూడా మ్యాచ్ లోకి దిగినట్లు అతను చెప్పాడు. ట్వంటీ 20 ప్రపంచ కప్ తర్వాత 2009లో రెండో విజయం సాధించాలనే ఉద్దేశంతో తాను మైదానంలోకి దిగినట్లు అతను తెలిపారు. మరో భారీ టోర్నమెంట్ గెలిచి దేశ ప్రజలకు కానుక సమర్పించాలని అనుకున్నట్లు మ్యాచ్ తర్వాత యూనిస్ ఖాన్ చెప్పాడు.