ప్రభుత్వం పని చేయడం లేదు: బాబు

శుక్రవారం, అక్టోబర్ 9, 2009, 18:47 [IST]
Chandrababu Naidu
కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదని, వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన శుక్రవారంనాడు వరద తాకిడికి గురైన మంత్రాలయంలో బాధితులను పరామర్శించారు. వరద బాధితుల వద్దకు మంత్రులు రావడం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో మంత్రులు నాలుగైదు రోజులు ఉండి సహాయక చర్యలు చేపడితే కొంపలేం మునగవని ఆయన వ్యాఖ్యానించారు.

కర్నూలులో నిన్నటి వరకు సహాయక చర్యలే చేపట్టలేదని, తాను నిన్న కర్నూలులో పర్యటించిన తర్వాత సహాయక చర్యలు మొదలు పెట్టారని ఆయన అన్నారు. వరద బాధితులను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారని ఆయన అన్నారు. మీ కష్టాలను చూస్తున్నానని, సహాయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. వరద బాధితులకు తాగేందుకు నీళ్లు లేవని, వంట సామగ్రి లేదని, ఇళ్లలో బురద పేరుకుపోయి ఉందని ఆయన అన్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets