సిమ్లా: పాకిస్తాన్ కు భారత్ చాలా సమయం ఇచ్చిందని, ఇందులో సగం సమయానికి కూడా పాకిస్తాన్ కు అర్హత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇరు దేశాలకు మధ్య పోలిక లేదని ఆయన మంగళవారం అన్నారు. పాకిస్తాన్ కు మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని, అది చాలా చిన్న భూభాగమని, పాకిస్తాన్ ను భారత్ తో పోల్చలేమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐని బలోపేతం చేయడంలో భాగంగా ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వచ్చారు.
పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల ప్రభావం మనపై పడుతుందని, అయితే మన ఆలోచనల్లో పాకిస్తాన్ కు చాలా సమయం, ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. తనకు సంబంధించినంత వరకు మనం ఇస్తున్న దానిలో సగం సమయం సరిపోతుందని ఆయన అన్నారు. ప్రపంచ వైఖరి పాకిస్తాన్ పట్ల మారిందని, ఇది ఒక రోజు వ్యవహారం కాదని, దీర్ఘమైన ప్రక్రియ అని, భారత్ ఒత్తిడి పెట్టిందని, పాకిస్తాన్ పై ప్రపంచమంతా ఒత్తిడి పెడుతోందని ఆయన అన్నారు. కొన్ని అంశాలను పరిష్కరించుకున్నామని, మరి కొన్నింటిని పరిష్కరించుకోవాల్సి ఉందని, మనం మంచి స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు కేవలం జిన్నా గురించి మాట్లాడుతున్నారని, దానికి వేయేళ్ల చరిత్ర ఉందని, బిజెపి చరిత్ర ఇప్పుడే మొదలైందని, తాను జిన్నా గురించి ఒక సెకండు కూడా ఆలోచించబోనని ఆయన అన్నారు. భారత్ వెలుగుతోందని బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదాన్ని ప్రజలు తిరస్కరించారని ఆయన చెప్పారు.