వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బి ఔదార్యం డ్యాన్సర్లకు సాయం

By Santaram
|
Google Oneindia TeluguNews

Amitabh Bachchan
ముంబై: అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థికస్థోమత లేక అంతర్జాతీయ పోటీలలో పాల్గొనలేకపోతున్నామని బాధపడుతున్న ఇద్దరు డాన్సర్లను బిగ్‌ బి ఆదుకున్నారు. త్వరలో వియత్నాంలో జరగనున్న ఇండోర్‌ ఆసియా క్రీడల్లో లాటిన్‌ అమెరికన్‌ డాన్స్‌ విభాగంలో పాల్గొనేందుకు ఇద్దరు డాన్సర్లు కఠోర శిక్షణ పొందారు. కానీ, అక్కడికెళ్లేందుకు వారివద్ద డబ్బుల్లేవు. తమ శిక్షకుడు సందీప్‌ సోపార్కర్‌ ద్వారా పలు కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించినా ఫలితం కనిపించలేదు. అమితాబ్‌ దంపతులతో సందీప్‌కు ఏడేళ్ల నుంచి పరిచయం ఉంది.

దీంతో కాస్త బెరుగ్గానే జయ, అమితాబ్‌లకు ఈ విషయం చెప్పగా..ఆర్థికసా యం చేయడానికి వెంటనే అంగీకరించారు. సరిగ్గా మూడే మూడు రోజుల్లో అమితాబ్‌ స్వహస్తాలతో సంతకం చేసిన రూ.7 లక్షల చెక్కు వచ్చేసింది. అమితాబ్‌ పెద్దమనసు చేసుకోకపోతే తమలాంటివాళ్లు లాటిన్‌ అమెరికన్‌ డాన్స్‌ లాంటి ఖరీదైన అంశం జోలికి వెళ్లలేమని డాన్సర్లలో ఒకరైన డియాగో పెరీరా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X