లాహోర్: సాయుధ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని లాహోర్ లో మరోసారి తెగబడ్డారు. లాహోర్ లో మూడు చోట్ల ఉగ్రవాదులు గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 23 మంది మరణించారు. నలుగురు సాయుధులు లాహోర్ లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) భవంతిపై దాడి చేశారు. పలువురిని బందీలుగా తీసుకున్నట్లు సమాచారం. ఎలైట్ పోలీసు సెంటర్ పై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేషనుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు.
ఎఫ్ఐఎ భవంతిపై దాడి చేసిన నలుగురు సాయుధుల్లో ఇద్దరు హతమైనట్లు పంజాబ్ ప్రొవిన్స్ హోం (ఇంటిరీయర్) కార్యదర్శి నదీం హసన్ ఆసిఫ్ మీడియాతో చెప్పారు. పోలీసు స్టేషన్ పై దాడిలో ఇద్దరు పాఠశాల పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది. మరో దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించినట్లు, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి కారు బాంబు కోహాట్ పట్టణంలోని పోలీసు స్టేషన్ వద్ద పేలిపోయినట్లు తెలుస్తోంది.
ఎఫ్ఐఎ భవంతి, మనవాన్ సంటర్ ల్లో దాదాపు ఆపరేషన్ పూర్తయింది. ఎలైట్ ఫోర్స్ కేంద్ర కార్యాలయం వద్ద మాత్రం చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. పది ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరి కాల్పులకు తెగబడ్డారని, కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించారని చెబుతున్నారు.