హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కూడా పలువురు మంత్రులు, నాయకులతో గురువారం కూడా మంతనాలు సాగించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విశ్వరూప్ జగన్ ను కలిసి మాట్లాడారు. పలువురు కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెసు సీనియర్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూనే మరో వైపు సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగన్ వర్గీయులు అంటున్నారు. కాంగ్రెసు యువ శాసనసభ్యులంతా వైయస్ రాజశేఖరరెడ్డి వల్లనే విజయం సాధించారని శాసనసభ్యుడు సతీష్ అన్నారు.
కాగా, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు గురువారంనాడు వైయస్ జగన్ ను పరామర్శించారు. జగన్ విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. జగన్ కు తగిన స్థానం పార్టీ అధిష్టానం కల్పిస్తుందని ఆయన చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల కోసం యానాం నియోజకవర్గంలో వసూలు చేసిన 23 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు.