శ్వేత సౌధంలో ఒబామా దీపావళి

గురువారం, అక్టోబర్ 15, 2009, 8:53 [IST]
Barack Obama
వాషింగ్టన్: చీకటిని తరిమికొట్టి వెలుగుకు ప్రతీకగా నిలిచే దీపావళి దీపాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం శ్వేతసౌధంలో వెలిగించారు. శ్వేతసౌధంలో దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడాన్ని 2003లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ప్రారంభించగా, ఈ పర్వదినంలో పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా నిలిచారు. స్థానిక శివ, విష్ణు దేవాలయం పూజారి నారాయణాచారి ఈ సందర్భంగా సంస్కృత మంత్రోచ్ఛారణలు కూడా జరిగాయి.

వచ్చే శనివారం హిందువులు, జైనులు, సిక్కులు, ఇతర బౌద్ధులు అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా దివ్వెలను వెలిగించి దీపావళి జరుపుకుంటారని, చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఒబామా ఈ సందర్భంగా అన్నారు. ఇది సంతోష సందర్భమే కాదు ప్రతిస్పందనా సమయం కూడా అని, అభాగ్యులను మనం గుర్తు చేసుకున్నప్పుడు వారి అవసరాలను తీర్చేందుకు సంసిద్ధం కావడానికి పునరంకితం కావాలని సూచించే సమయం అని ఆయన అన్నారు.

అర గంటపాటు శ్వేత సౌధంలోని ఈస్ట్ రూంలో జరిగిన వేడుకల్లో భిన్న సంస్కృతుల సమ్మేళనం దర్శనమిచ్చింది. ఆసియన్స్, అమెరికన్లు, ఇండియన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, రాయబారి మీరా శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మిఠాయిని పంచారు. పండుగ ఆహార పదార్థాలు గానీ పాటలూ నృత్యాలూ లేవు.
User Comments
మన్మోహన్ singh 15 Oct 2009 11:38 am
థాంక్స్ ఒబామా ....నా ఇజ్జత్ కాపాడినావు.ఎందుకంటే బతుకు సక్కగ లేదు ర బై....బాంచెను నీ కళ్ళు మొక్కుత.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets