కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నాందేడ్ వాసుల మృతి

సోమవారం, అక్టోబర్ 19, 2009, 10:06 [IST]
Karimnagar
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రలోని నాందేడ్ వాసులని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం హుస్నాబాద్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

నాందేడ్ కు చెందిన వారు కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న సుమోను లారీ ఢీకొట్టింది. గాయపడిన ముగ్గురిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఒక్క పాప,నలుగురు మహిళలు ఉన్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets