మావోయిస్టుల దాడిలో ముగ్గురు మృతి

మంగళవారం, అక్టోబర్ 20, 2009, 13:35 [IST]
Maoists
ఛాత్రా: జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లా రాజ్ పూర్ లో మావోయిస్టులు మంగళవారం జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. ఈ దాడిలో నక్సల్స్ అనుబంధ సంస్థ నాయకుడు కూడా హతమైనట్లు సమాచారం. మృతులను నక్సల్స్ అనుబంధ సంస్థ శస్త్ర పీపుల్స్ మోర్చా హెడ్ ఉమేష్ మాలి, లోక్ జనశక్తి స్థానిక నాయకుడు ఉమేష్ సింగ్ భోక్తా, రంజిత్ రజ్జక్ లుగా గుర్తించారు.
  Read:  In English 
మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో మిడిల్ స్కూల్లో జరుగుతున్న ఓ సాంస్కృతి కార్యక్రమాన్ని చూస్తుండగా సాయుధ మావోయిస్టులు దాడి చేసి కాల్పులు జరిపినట్లు పోలీసు సూపరింటిండెంట్ దేవ్ బిహారీ శర్మ చెప్పారు. దాడిలో గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పోలీసు డ్రైవర్ కూడా ఈ దాడిలో గాయపడినట్లు ఆయన తెలిపారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets