అన్నవరం: తమ కాంగ్రెసు పార్టీ అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ కు వ్యతిరేకంగా హర్షకుమార్ మాట్లాడుతుండడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. హర్షకుమార్ కు పార్టీ కార్యకర్తలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. మంగళవారం ఉదయం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుడిని దర్సించుకున్నారు. తన సతీమణి పుట్టిన రోజు సందర్భంగా స్వామివారికి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
హర్షకుమార్ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోభావావలను దెబ్బ తీస్తున్నాయని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ కు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. హర్షకుమార్ ఒకే పేరుతో రెండు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు.