భోపాల్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను, ఇతర నాయకులను చంపుతామని బెదిరించింది. ఈ మేరకు లష్కరే తోయిబా ఝాన్సీ రైల్వే పోలీసులకు పంపింది. ఝాన్సీ రైల్వే పోలీసు సూపరింటిండెంట్ కు ఆ లేఖ అందిన వెంటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి భద్రతను పెంచారు.
నిజంగానే లష్కరే తోయిబా రాసిన లేఖనేనా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. బెదిరింపు లేఖ వచ్చిన విషయాన్ని పోలీసు అధికార ప్రతినిధి ప్రకాష్ దీక్షిత్ ధృవీకరించారు. చౌహాన్ నే కాకుండా మరింత నాయకుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ వారిని చంపుతామని లేఖలో ఉగ్రవాదులు బెదిరించినట్లు ఆయన తెలిపారు.