కరీంనగర్: కరీంనగర్ లో శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. దానం నాగేందర్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మంత్రిని వారు ఘెరావ్ చేశారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.
డెంగ్యూ తదితర వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ దానం నాగేందర్ ను ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు చేసిన లాఠీచార్జీ యువరాజ్యం అధ్యక్షుడు మహిపాల్ తలకు తీవ్రంగా గాయమైంది. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని జీపులో తోసేసి తీసికెళ్లారు. ఈ సమయంలో కొంత మంది కింద పడిపోయినా పోలీసులు పట్టించుకోలేదు.