లారీ ప్రమాదంలో ఆరుగురు మృతి

శనివారం, అక్టోబర్ 24, 2009, 11:20 [IST]
Nalgonda
నల్గొండ: జిల్లాలోని మోత్కూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కలపతో వెళ్తున్న లారీ చెరువులో పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతులంతా రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ కలపకు సంబంధించిన వే బిల్లులను కూడా పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets