హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. అనీ నికుంజ్ అనే 32 ఏళ్ల యువకుడు తన భార్య అపర్ణ, తన పాపలతో కలిసి ప్రయాణిస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనీ నికుంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య అపర్ణకు స్వల్పంగా గాయాలయ్యాయి. పాప సురక్షితంగా ఉన్నట్లు హైదరాబాద్ లోని అనీ నికుంజ్ కుటుంబానికి సమాచారం అందింది.
దక్షిణాఫ్రికాలో అనీ నికుంజ్ పని చేస్తున్న కార్యాలయం ఉద్యోగులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. భారీ వర్షం కురుస్తోందని, ఈ సమయంలో కారును యూ టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం అందిందని అనీ నికుంజ్ తండ్రి చెప్పారు. అనీ నికుంజ్ తండ్రి ఎన్. శేషగిరిరావు కుటుంబం హైదరాబాదులోని రామకృష్ణాపురం టెలిఫోన్ కాలనీ వైష్ణవి ఎమరాల్డ్ అపార్టుమెంటులో ఉంటోంది. అనీ నికుంజ్ శేషగిరి రావు చిన్న కుమారుడు. అనీ నికుంజ్ దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లోని ఒక కంపెనీలో రెండేళ్లుగా పని చేస్తున్నాడు. అనీ నికుంజ్ కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితమే హైదరాబాద్ వచ్చి వెళ్లారు.