మావోల చేతిలో రాజధాని రైలు డ్రైవర్?

మంగళవారం, అక్టోబర్ 27, 2009, 17:23 [IST]
Rajdhani Exp
కోల్ కత్తా: భువనేశ్వర్ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్ ను, అసిస్టెంట్ డ్రైవరును మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బంచ్ తాలాలో రాజధాని ఎక్స్ ప్రెస్ ను ఆపేసి వారిద్దరిని నక్సలైట్లు అపరించుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. నక్సలైట్లు ఎర్ర జెండా ఊపి రైలును ఆపి లోకో పైలట్ ను, అతని అసిస్టెంట్ ను ఎత్తుకుపోయినట్లు సమాచారం.

అయితే, మావోయిస్టులు చంపేస్తారనే భయంతో రైలును ఆపేసి డ్రైవర్ పారిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఘటనతో తమకు ఏ విధమైన సంబంధం లేదని మావోయిస్టు నేత కిషన్ జీ జీ న్యూస్ చానెల్ తో చెప్పారు. రైల్వై రక్షణ దళం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
User Comments
ఆంధ్ర 28 Oct 2009 03:07 am
రోశయ్య ని ముఖ్య మంత్రి కోన సాగిస్తెయ్. కాచిగూడ సెంట్రల్ రైల్ కూడా మావోల చేతిలో కి పోతది.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets