గ్రేటర్ పొత్తులపై ఆలోచిస్తాం: డిఎస్

గురువారం, అక్టోబర్ 29, 2009, 15:05 [IST]
D Srinivas
హైదరాబాద్: పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, అవగాహన కుదుర్చుకోవడం వంటి విషయాలపై ఆలోచిస్తామని ఆయన చెప్పారు. తాము 150 డివిజన్లలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదేనని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ అభ్యర్థే మేయరు అభ్యర్థిగా ఉంటారని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చర్చించేందుకు ఆయన రేపు మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెసు అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets