న్యూఢిల్లీ: వైయస్ పథకాలు అమలు కావడం లేదని చేసిన వ్యాఖ్యలపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నే అడగాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. తండ్రి పథకాలు సజావుగా అమలు కావడం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై సూటిగా స్పందించడానికి ఆయన నిరాకరించారు. జగన్ వ్యాఖ్యలపై తానేమీ స్పందించబోనని ఆయన అన్నారు. అది కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక, దాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి ఉన్నారని, హామీల అమలులో పరిస్థితులను బట్టి ఇబ్బందులు వస్తే ప్రజలకు చెప్పుకుంటామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా రోశయ్యను మార్చే ఆలోచన పార్టీ అధిష్టానానికి లేదని అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరింత కాలం రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారని ఆయన చెప్పారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానానికి చెందిన అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీలను కలిశారు. అందుబాటులో లేకపోవడంతో ఆయన సోనియాను కలవలేకపోయారు. వారం పదిరోజుల్లో కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎపి భవన్ లో ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రోశయ్య బాగా పనిచేస్తున్నారని, కావాల్సిన సాయం పైనుంచి వస్తే రోశయ్య మరింత బాగా పనిచేస్తారని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత అధిష్టానం జోక్యం చేసుకుని అన్ని సమస్యలనూ చక్కదిద్దిందని, ఇప్పుడన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందుతోందని, అధిష్టానం కూడా రోశయ్యకు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం తలెత్తిన సమస్యలన్నీ సమసిపోయినట్లేనని ఆయన అన్నారు. తమకు ఏ విధమైన సంక్షోభం లేదని, స్పష్టమైన మెజారిటీ ఉందని ఆయన అన్నారు. రోశయ్యతో తనకు మంచి సంబంధాలున్నాయని, వైయస్ లాగానే వైయస్ ది తనది విన్నింగ్ కాంబినేషన్ గా ఉంటుందని ఆయన అన్నారు.