హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా, కడప పార్లమెంటు సభ్యుడిగా వైయస్ జగన్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ప్రజాభీష్టం మేరకే జగన్ ప్రచారంలో పాల్గొంటారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రేటర్ హైదరాబాదులో నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ)లోని 150 డివిజన్లలో కూడా తాము అభ్యర్థులను పోటీకి దించుతామని ఆయన చెప్పారు.
కాగా, వైయస్ జగన్ గురువారం ఉదయం బెంగుళూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన వచ్చే నెల 8వ తేదీ తర్వాతనే హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 31వ తేదీన వెలువడుతుంది. వచ్చే నెల 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.