ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి

శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 14:22 [IST]
Anantapur
అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మరణించారు. జిల్లాలోని సింగనమల మండలం లోలూరు గ్రామ సమీపంలో ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా దినసరి కూలీలే.

ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 13 మంది మహిళలు ఉన్నారు. ఆటో డ్రైవర్ కూడా మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets