జైపూర్ అగ్నిప్రమాదంలో 13 మంది మృతి

శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 9:56 [IST]
Jaipur Fire Accident
జైపూర్: జైపూర్ లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) డిపోలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు. 150 దాకా గాయపడ్డారు. ఐఒసి చరిత్రలో అత్యంత దారుణమైన ప్రమాదం ఇది. జైపూర్ ఐఒసి డిపోలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మరో ఐదారుగురు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని రాష్ట్ర సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. సైన్యానికి, బొంబాయి హైకి చెందిన బృందాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన ఐఒసి డిపో విమానాశ్రయానికి సమీపంలో సీతాపుర పారిశ్రామిక వాడలో ఉంది.
  Read:  In English 
సహాయ చర్యలు జరుగుతుండగానే ఐఒసి డిపోలో మరో పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాద స్థలానికి పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా చేరుకున్నారు. ప్రమాద నష్టాన్ని తగ్గించడానికి నిపుణులను రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం చాలా పెద్దదని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదం ఒక్క డిపోకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర డిపోలకు కూడా పాకింది. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఐదు నుంచి పది లక్షల రూపాయలేసి నష్టపరిహారాన్ని మంత్రి ప్రకటించారు. లీకేజీ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంటలు డిపో నుంచి పైప్ లైన్ కు పాకాయి.ఈ ప్రమాదంతో పక్కన ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అగ్ని ప్రమాంద పెట్రోల్ స్టోరేజీ ట్యాంక్ వద్ద సంభవించిందని, ఆ తర్వాత మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించాయని ఐఒసి చైర్మన్ సార్థక్ బహూరియా చెప్పారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets