రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా నివాసంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. కొడాకు చెందిన రాంచీ, చైన్ బాసాల్లోని నివాసాల్లో తమ అధికారులు వేర్వేరుగా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటి శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎక్కడెక్కడ దాడులు చేశారనే విషయాన్ని సాయంత్రం మాత్రమే చెప్పగలమని ఆయన అన్నారు.
మనీ లాండరింగ్ ఆరోపణలపై మధు కొడాపై, 9 మంది ఆయన గత మంత్రివర్గ సహచరులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. చట్ట విరుద్ధంగా ప్రభుత్వ నిధులను మళ్లించి, అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్ లాండ్, ఇండోనేషియా, సింగపూర్, లైబేరియా వంటి దేశాల్లో వందల కోట్ల రూపాయలను కూడబెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి.