హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అభ్యర్థుల జాబితా రూపకల్పనకు మంగళవారం పొన్నాల లక్ష్మయ్య, ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్ సమావేశమయ్యారు. తాము డివిజన్ కు ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు నివేదిక సమర్పిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తుది జాబితాను పిసిసితో చర్చలు జరిపి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. మజ్లీస్ తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు చిత్తయిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ టికెట్ల కోసం కోలాహలం మొదలైంది. కాంగ్రెసులోని రెండు వర్గాలు టికెట్ల పంపకంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు.

Oneindia Login