హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులను తాము సమర్థంగా తిప్పికొడతామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కమార్ చెప్పారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకుంటామని కూడా ఆయన చెప్పారు. తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఆయన మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల సమస్య తీవ్రంగా ఉందని, అయితే తాము తిప్పికొట్టగలమని ఆయన అన్నారు.
మావోయిస్టులు హింసాత్మక చర్యలను విరమించాలని, తమ విధానాలను మార్చుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలువునిచ్చారు. మావోయిస్టులకు ప్రజల్లో ఆదరణ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు.