దర్యాప్తులో కొడా సహాయ నిరాకరణ

మంగళవారం, నవంబర్ 3, 2009, 11:09 [IST]
Madhu Koda
రాంచీ: అక్రమార్జన కేసులు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా ఆదాయం పన్ను శాఖకు సహకరించడం లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కొడాను ఆదాయం పన్ను శాఖ అధికారులు విచారించారు. ఈ విచారణను వీడియో తీశారు. కేసులో రుజువుల కోసం దాన్ని రికార్డు చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ఐటి అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొడా సంపాదన కోసం వరుసగా మూడో రోజు సోమవారం కూడా కొనసాగాయి.

దర్యాప్తులో కొడా సంపూర్ణంగా సహకరించడం లేదని ఐటి శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. వివిధ ప్రాంతాల్లో తాను దాచిన డబ్బు గురించి, డబ్బులు పెట్టడానికి వాడిన నెట్ వర్కు గురించి, లావాదేవీల్లో తనకు సహకరించిన వ్యక్తుల గురించి కొడా దర్యాప్తులో వెల్లడించినట్లు ఐటి అధికారులు చెప్పారు. విచారణ నిమిత్తం ఈ నెల 6వ తేదీన తమ ముందు హాజరు కావాలని వినోద్ కుమార్ సిన్హా, సంజయ్ చౌదరి, దేవేంద్ర ముఖియా, బసంత్ భట్టాచార్య, మనోజ్ పునామియా, అనిల్ బస్త్వాడే అనే ఆరుగురు వ్యక్తులకు సమన్లు జారీ చేసినట్లు ఐటి శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets