To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

నేషనల్ డిఫెన్స్ కాలేజీపై దాడికి కుట్ర

AK 47
వాషింగ్టన్: భారత దేశంలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీపై, డేనిష్ వార్తా పత్రికపై దాడులు చేయడానికి లష్కరే తోయిబా కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) వెల్లడించింది. గత నెల తాము అరెస్టు చేసిన డేవిడ్ కొలేమాన్ హెడ్లీ, తహవ్వూర్ హుస్సేన్ రాణాలను విచారించినప్పుడు ఆ విషయం బయట పడినట్లు తెలిపింది. రాణా బెయిల్ పిటిషన్ ను చికాగో కోర్టులో వ్యతిరేకిస్తూ ఎఫ్ బిఐ ఈ విషయం చెప్పింది.

పాకిస్తాన్ పుట్టిన కెనడియన్ పౌరుడు అయిన రాణా చికాగోలో ఉంటున్నాడు. అమెరికా పౌరుడు అయిన అతని మిత్రుడు హెడ్లీతో పాటు రాణాను ఎఫ్ బిఐ గత నెల అరెస్టు చేసింది. డెన్మార్క్, భారత్ ల్లో వారిద్దరు దాడులకు కుట్ర చేసినట్లు ఎఫ్ బిఐ వాదిస్తోంది. హెడ్లీ బెయిల్ పిటిషన్ పై విచారణ డిసెంబర్ కు వాయిదా పడింది. సెప్టెంబర్ 7వ తేదీన మిత్రులిద్దరి మధ్య జరిగిన చర్చలను బట్టి భారత్ లోని నేషనల్ డిఫెన్స్ కళాశాలపై దాడికి కుట్ర చేసినట్లు బయటపడిందని, దానితో పాటు ఇతర లక్ష్యాలపై కూడా వారిద్దరి మధ్య సంభాషణ జరిగిందని ఎఫ్ బిఐ కోర్టుకు తెలిపింది.
నవంబర్ 4, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
1st ODI , Sheikh Zayed Stadium, Abu Dhabi
England decided to bat

కాశ్మీర్ లో లష్కర్ ఉగ్రవాది హతం

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లా కెష్వాన్ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో గురువారం ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు సైనికులు, పోలీసులు కేశ్వాన్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో గురువారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి......

బ్యాడ్మింటన్ పోటీలకు లష్కరే ముప్పు

హైదరాబాద్: సోమవారం నుంచి హైదరాబాద్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు లష్కరే తోయిబా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది. ఇంటలిజెన్స్ బ్యూరో రాష్ట్ర అధికారులకు సమాచారం అందించింది. పాకిస్తాన్ లో శ్రీలంక క్రికెటర్లపై చేసినట్లుగా హైదరాబాదులో అంతర్జాతీయ క్రీడాకారులపై ఈ టోర్నమెంటు సందర్భంగా దాడి చేసే.....
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
Oneindia  Oneindia Login