To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

మంత్రి సుభాష్ చంద్ర బోస్ పై మావోయిస్టుల గురి

Pilli Subhash Chandra Bose
రాజమండ్రి: సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కు మావోయిస్టులు హెచ్చరిక లేఖ పంపారు. బీసీ వర్గానికి చెందిన తనపై మావోయిస్టుల కన్ను పడదని ఇంతకాలం అనుకున్న మంత్రికి దీనితో ముచ్చెమటలు పోస్తున్నాయి. ఆయనపై దాడి చేసేందుకు ముందస్తు సన్నాహంగా గత ఆదివారం రామచంద్రపురంలో రెక్కీ నిర్వహించినట్టు మావోయిస్టులు ఒక లేఖలో తెలిపారు. చత్తీస్‌గఢ్‌లోని ఒక కుంట దగ్గర వదిలిన లేఖ ప్రతులను మారేడుమిల్లిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు మీడియా ప్రతినిధులకు అందజేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ లేఖలోని సారాంశం ఇది. మంత్రి పిల్లి సుభాచంద్రబోస్‌ పేద, దళిత, గిరిజన వర్గాలకు కంటగింపుగా మారారని, ఇందుకు సంబంధించి తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో అధికారులు అవినీతికి పాల్పడుతుంటే వారికి కొమ్ముకాస్తున్నారని, ఆ లేఖల్లో ఆరోపించినట్టు సమాచారం. ఈ అభియోగాలపై త్వరలోనే మంత్రిని బోస్‌ను ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షిస్తామని హెచ్చరించారు.
నవంబర్ 4, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
ODI, Adelaide Oval
India won by 4 wickets

ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సిందే: శత్రుచర్ల

హైదరాబాద్‌: దూర ప్రాంతాలకు రాత్రి నడిపే ప్రైవేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని..రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. అలా లేకుంటే ఆ వాహనాలను సీజ్‌ చేస్తామని ఆయన ఖచ్చింతగా చెప్పారు. అంతేగాక తెల్లవారుజామున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతండడంతో..ఉదయం 3గం.ల నుంచి 5గం.ల వరకూ బస్సులు నిలిపివేయాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. నిన్న.....
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
Oneindia  Oneindia Login