To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

జర్నలిస్ట్ ప్రభాస్ జోషి హఠాన్మరణం

Prabhash Joshi
ఛండిఘఢ్‌: ప్రముఖ జర్నలిస్ట్‌ ప్రభాష్‌ జోషి గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. 72 సంవత్సరాల జోషికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు వున్నారు. న యీ దునియా పత్రిక ద్వారా జర్నలిస్ట్‌ జీవితాన్ని ఆరంభించారు. ప్రముఖ హిందీ దినపత్రిక జనసత్తాకు 1983 సంవత్సరం వరకు జోషి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 తర్వాత పత్రికారంగం నుండి తప్పుకున్న తర్వాత నుండి ఇప్పటికి జనసత్తాకు గౌరవ సంపాదకుడిగా పనిచేశారు.

పత్రికారంగంలో గాంధేయ విలువలను కాపాడేందుకు జోషి ఎనలేని కృషి చేశారు. అంతేకాక హిందీ జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అహ్మదాబాద్‌, ఛంఢిఘర్‌, ఢిల్లీ విభాగాలకు రెసిడెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. జోషి అకాల మృతికి హర్యానా గవర్నర్‌ జగన్నాథ్‌ పహాడియా, ముఖ్యమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు.
నవంబర్ 6, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
1st ODI , Sheikh Zayed Stadium, Abu Dhabi
England decided to bat

పూరీ మార్క్..రవితేజ టచ్!!

"ఆంజనేయుల మీద చెయ్యవేయడమంటే ఆల్ మోస్ట్ ప్రాణాలు వదిలేసినట్లే"...అంటూ రవితేజ తనదైన స్టైల్లో ఆంజనేయులు చిత్రంలో చెప్పే డైలాగులు ఇప్పుడు అన్ని చోట్లా చర్చగా మారాయి. సాధారణంగా ఇలాంటి డైలాగులు పూరీ జగన్నాధ్ చిత్రాల్లో చోటు చేసుకుంటాయి. అందులోనూ దర్శకుడు పరుశరామ్..పూరీ జగన్నాధ్ శిష్యుడు కావటంతో ఆ ప్రభావం బాగా ఎక్కువగా ఉందని రషెష్ అంటున్నారు. అసలు.....

విలక్షణ నటుడు కిషోర్ దాస్

అది టాటా ఇండికాం హోర్డింగ్. అందులో జ్యోతిషుడిగా ఒక వ్యక్తి కనిపించాడు. ఖైరతాబాద్ బ్రిడ్జి వద్ద పెట్టిన ఆ హోర్డింగ్ చూసిన కొందరు చెప్పులు విప్పేసి దండం పెట్టుకోవడం, మరి కొందరు ఆయనతో జాతకం చెప్పించుకోవాలని సదరు యాడ్ ఏజెన్సీకి ఫోన్లు చేయడం జరిగాయి. నిజానికతను జ్యోతిష పండితుడు కాడు. పబ్ లకు డిస్కోలకు వెళ్ళే ఆధునికుడు......
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
Oneindia  Oneindia Login