న్యూఢిల్లీ: గ్రేటర్ టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న వార్తలు పూర్తిగా నిరాధారమని రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వీరప్ప మొయిలీ అన్నారు. అభ్యర్థులనుండి డబ్బులు వసూలు చేశారనడం తప్పుడు ఆరోపణలని మొయిలీ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల విషయంలో అధిష్టానం తలదూర్చదని, ఎన్నికల సమయంలో ఇలాంటి విషయాలు మామూలేనని ఆయన అన్నారు. పరిస్థితిని సీఎం రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ చక్కదిద్దుతారన్నారు. టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు రావడంతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ రాజీనామా చేశారు.
అంతకు ముందు జరిగిన పరీణామాలివి: టిక్కెట్ల కేటాయింపులో మంత్రి దానం నాగేందర్ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నివాసం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దానం నాగేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దానం తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. టిక్కెట్ల కేటాయింపులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు.
గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో నిజమైన కార్యకర్తలకు మంత్రి దానం నాగేందర్ అన్యాయం చేశారని ఎమ్మెల్యేలు భిక్షపతి, ఆకుల రాజేందర్ ఆరోపించారు. అభ్యర్థులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.