To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

అందరికీ టికెట్ల్లు ఇవ్వలేం: డి.శ్రీనివాస్

D Srinivas
హైదరాబాదు: టిక్కెట్ల అంశాన్ని రాజకీయం చేయొద్దని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను, నేతలను కోరారు. కోరినవారందరికీ టికెట్లు ఇవ్వలేమని, అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే టిక్కెట్లిచ్చామని డిఎస్‌ అన్నారు. గ్రేటర్‌ అభ్యర్థుల జాబితా విషయంలో ఎమ్మెల్యేలందరూ సంతృప్తిగా ఉన్నారని, ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ నిన్న తనపై ఆరోపణలు చేసిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. అంతమాత్రాన తాను టిక్కెట్లు అమ్ముకున్నట్లా? అన్ని ప్రశ్నించారు.

టిక్కెట్లు అమ్ముకున్నానని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేల్లో ఒకరు అసలు ఈ ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తని డిఎస్‌ అన్నారు. ఉన్నది 150 సీట్లేనని, కావాలన్న వారందరికీ టెక్కెట్లు ఇవ్వటం సాధ్యపడదని, ఏ పార్టీ జాబితా ప్రకటించినా అసంతృప్తులు, బుజ్జగింపులు, ఆందోళనలు సహజమేనని డిఎస్‌ అన్నారు.
నవంబర్ 7, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
ODI, Adelaide Oval
India won by 4 wickets

ఆ విషయాలు జగన్ నే అడగాలి: డిఎస్

న్యూఢిల్లీ: వైయస్ పథకాలు అమలు కావడం లేదని చేసిన వ్యాఖ్యలపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నే అడగాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. తండ్రి పథకాలు సజావుగా అమలు కావడం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై సూటిగా స్పందించడానికి ఆయన నిరాకరించారు. జగన్ వ్యాఖ్యలపై తానేమీ స్పందించబోనని ఆయన అన్నారు......

మంత్రి పదవుల కోసం ఢిల్లీ పైరవీలు

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.రోశయ్య తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు బలపడుతున్నాయి. కనీసం పది మందిని ఆయన కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్నవారు, మంత్రి పదవులను కాపాడుకోదలుచుకున్న వారు పైరవీలు మొదలు పెట్టారు. చాలా మంది ఢిల్లీకి తమ మకాం మార్చారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు మంత్రి.....
User Comments
రెడ్డి 07 Nov 2009 08:48 pm
నీవసలు పార్టిని వదిలి ఇంటిలో ఉంటె పార్టిలోని కుమ్ములాటలు సర్దుకుంటాయి.
[ మీ వ్యాఖ్య రాయండి ]
Oneindia  Oneindia Login