
పెషావర్: పాకిస్తాన్ లోని పెషావర్ ఆత్మాహుతి దాడులతో అట్టుడుకుతూనే ఉన్నది. తాజాగా గురువారం పెషావర్ లోని ఖైబర్ రోడ్డులో జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read: In English
జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం వద్ద పేలుడు సంభవించినప్పుడు లోపల చాలా మంది న్యాయవాదులున్నారు. కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన కారు పేలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. దక్షిణ వజీరిస్తాన్ లో మిలిటెంట్లపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తున్న నేపథ్యంలో పెషావర్ లో దాడులు ముమ్మరయ్యాయి. మిలిటెంట్లు పెషావర్ ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు.



















