తెలంగాణపై 5న పార్టీలతో కేంద్రం చర్చలు

బుదవారం, డిసెంబర్ 30, 2009, 18:16 [IST]
Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్దిష్టమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలను డిల్లీలో చర్చలకు అహ్వానించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికింది. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జనవరి 5వ తేదీన చర్చలు జరుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చర్చలకు ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఏకాభిప్రాయ సాధనకు ఈ అఖిల పక్ష సమావేశంలో చర్యలు తీసుకుంటారు.

కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం, బిజెపి, మజ్లీస్ పార్టీలను కేంద్రం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించింది. తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగినందుకు హోం శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణపై నిర్దిష్టమైన చర్యకు ఈ సమావేశం ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కాగా, తాజా పరిణామంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సమావేశమవుతోంది.
User Comments
santhosh 31 Dec 2009 10:05 am
రఘు .. మేరు చెప్పింది నిజమే. కానీ విడిపోక పోతే తెలంగా పూర్తి నష్టం వుంది. గత వరం కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ నిధులు పంపితే దానిలో తెలంగాణా కు కేటాయించినది చూసి మేరు చెప్పండి ? తెలంగాన కావాలా వద్ద అని? ఈక పోతే రాష్ట్రానికి దరిద్రం రామ రావు వాళ్ళ పుట్టింది . వాడు కుల రాజకీయాలు తెచ్చాడు. మా తెలంగాణా లో రెడ్డి పలుకుబడి , అలాగే ఆంధ్ర లో కమ్మ పలుకు బడి పెంచాడు.మరి మా లాంటి బలహీన వర్గాల పరిశితి ఏమిటి? వాడి లాగానే రాజేషేకర్ రెడ్డి కూడా పాలించాడు. ప్రజలు వెదవలు కాకపోతే ?
raghu 31 Dec 2009 09:58 am
ముందు హైదరాబాద్ లో ప్రభుత్వ మరియు చారిటి భూములను అమ్మేసి ప్రతి వేదవను విచారించండి . అందులో రామోజీ రావు, నాగార్జున , వై స జగన్ , రామ నాయుడు , మురళి మోహన్ వున్నారు. తెలంగాణా మరియు సమైక్య ఆంధ్ర గొడవలలో వెళ్ళు ఒక్కరు మాట్లాడటం లేదు. అసలు ఈ పరిస్తితులలో మాట్లాడిన వారు కేవలం రోస్సయ్య, చిరంజీవి , మోహన్ బాబు. వారికీ అక్రమ ఆస్తులు లేవు కాబట్టే మాట్లాడు తున్నారు. అసలు దొంగ నాకొడుకు చంద్ర బాబు గడు డ్రామాలు ఆడుతున్నాడు. తెలంగాణా విడిపోతే వారు హైదరాబాద్ తీవ్రవాదులను , నక్సల్స్ ను కంట్రోల్ చేయలేరు,
ఆంధ్రా 31 Dec 2009 08:32 am
తేట,తేట,-తెలుగులో నిజమై న పనులు తెలంగాణా వాడిని ప్రధాని చేయడము,హైదరాబాదును మెట్రో పాలిటన్ సిటి చెయడము.వ్క్రభాష్యగాలాకు చరిత్రను వ్క్రికరించాదము తెలుసు.
నిజం 31 Dec 2009 04:47 am
కాంగ్రెస్ ఇష్టమైన బిల్లులు మాత్రం యం.పి లను కోనైనా లేక వాళ్ళు మతోన్మాదులుగా చెప్పబడే బి.జె.పి తో కలిసైనా పాస్ చేసుకుంటారు. ఇష్టం లేని వాటిని మాత్రం ఏకాభిప్రాయం అని నాన్చుతారు.
తెలుగు బిడ్డ 31 Dec 2009 03:48 am
కాంగ్రెస్సు లేదా టిడిపి చాలు తెలంగాణా రాక పోవడానికి.
నిజానికి nijam 31 Dec 2009 01:57 am
కాంగ్రెస్ బిజెపి చాలు తెలంగాణా రావడానికి
జావి 31 Dec 2009 01:12 am
జై ఆంధ్రా !!!
nijam 31 Dec 2009 12:56 am
BJP, TRS tappa evvaru Telangana ki oppukoru...idi fact!!!
తెలంగాణా మంత్రులు 30 Dec 2009 11:47 pm
కాంగ్రెస్ డ్రామా ..!!పిచ్చి జనాలు ..!! తెలంగాణా కోసం పోరాడేది కాంగ్రెస్ ...తెలంగాణా కు మోసం చేసేది కాంగ్రెస్
bcm 30 Dec 2009 11:43 pm
వేరి గుడ్ ఇన్దికతిఒన్ రియల్ కలోర్స్ అఫ్ బబుస్ షౌల్ద్ కం అవుట్,౫౦ యేఅర్స్ స్త్రుగ్గ్లె షౌల్ద్ win
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Kings XI Punjab: 69 / 3, 10.2 Overs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
West Indies: 92 / 3, 33.6 Overs
IPL, Feroz Shah Kotla, Delhi
Match starts at 08:00 pm IST