యుపి రైలు ప్రమాదాల్లో పది మంది మృతి

శనివారం, జనవరి  2, 2010, 15:09 [IST]
Train Accident
కాన్పూర్: దట్టమైన పొగం మంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్టంలో శనివారం ఉదయం జరిగిన మూడు రైలు ప్రమాదాల్లో పది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 15 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. భివానీ - గోరఖ్ పూర్ మధ్య నడిచే గోరఖ్ దామ్ ఎక్స్ ప్రెస్ రైలు కాన్పూరు జిల్లాలోని పాంకీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాగ్ రాజ్ ఎక్సుప్రెసు రైలును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.
  Read:  In English 
సీతామారహీ లివాచీ ఎక్స్ ప్రెస్ రైలు మగధ ఎక్స్ ప్రెసు రైలును ఢీకొన్న సంఘటన కూడా ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లిచావీ రైలు డ్రైవర్ గాయపడ్డాడు. మరో సంఘటనలో సరయూ ఎక్ర్ ప్రెస్ రైలు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించేలదు. ఈ మూడు ప్రమాదాల వల్ల ఢిల్లీ - కాన్పూరుల మధ్య నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets