
కాన్పూర్: దట్టమైన పొగ మంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మరణించి ఉంటారని ఆనుమానిస్తున్నారు. ఇట్టావా సమీపంలోని సరాయభోపటా వద్ద బీహార్ కు చెందిన లిచ్వీ ఎక్స్ ప్రేస్ రైలు ఢిల్లీ - ఇస్లామాపూర్ మగధ్ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లు అనుమానిస్తున్నారు.
Read: In English
మరో ఘటనలో గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు కాన్పూర్ జిల్లాలోని పంకీ వద్ద ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. ప్రయాగ్ రాజ్ చివరి భోగీ తీవ్రంగా దెబ్బ తింది. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగ మంచు అలుముకున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు సంభవించాయి. రోడ్డు, విమాన యానాలపై కూడా పొగమంచు ప్రభావం పడింది.















