
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై ది ఎగ్జెల్డ్ వైబ్ సైట్ ఆధారంగా వార్తాకథనాన్ని ప్రచురించిన టీవీ5 ప్రతినిధులు బ్రహ్మానంద రెడ్డి, వెంకటకృష్ణలను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై జర్నలిస్టుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ది ఎగ్జైల్ ఆధారం తొలుత వార్తాకథనం ప్రచురించిన చానెల్ టీవీ 5 కాగా, ఆ తర్వాత దాన్ని ప్రసారం చేసిన సాక్షి, ఎన్టీవి చానెళ్లపై పోలీసులు సూమోటాగా కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సిబిసిఐడికి అప్పగించారు. టీవీ5 కార్యాలయం నుంచి పోలీసులు సిడీలు, టేపులు, సర్వర్లు స్వాధీనం చేసుకున్నారు.
Read: In English
హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీసు స్టేషనులో సాక్షి టీవీకి చెందిన సిఇవో ప్రయదర్శిని రాంరెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్ ఎన్. భాస్కర్, రిపోర్టర్ సివి అరవింద్ యాదవ్ లపై కేసులు నమోదు చేశారు. అస్థిరతే ధ్యేయంగా కుట్ర చేసే ఆరోపణలపై పోలీసులు సిఐడి దర్యాప్తు చేస్తోంది. టీవీ చానెళ్లలో వార్తాకథనాలు ప్రసారమైన మరుక్షణమే రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ ఆస్తులపై పెద్ద యెత్తున దాడులు జరిగిన విషయం తెలిసిందే.

















