హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ తార సానియా మీర్జా నిశ్చితార్థం రద్దయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు. మనస్పర్థల కారణంగానే ఈ నిశ్చితార్థం రద్దయినట్లు సమాచారం. నిరుడు జులై 10వ తేదీన సోహ్రాబ్ మీర్జాతో సానియా నిశ్చితార్థం జరిగింది. సోహ్రాబ్ మీర్జా ప్రస్తుతం బ్రిటన్ లో ఎంబిఎ చేస్తున్నాడు. పెళ్లి తర్వాత ఆటలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత ఆటకు స్వస్తి చెబుతానని ఇటీవల సానియా మీర్జా చెప్పింది. అయితే అది ఆమె ఇష్టమని సానియా తండ్రి అన్నారు. పెళ్లి తర్వాత క్రీడలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై నిర్ణయాన్ని సానియాకే వదిలేస్తున్నట్లు సోహ్రాబ్ నిశ్చితార్థం సమయంలో అన్నాడు. సోహ్రాబ్ సానియా చిన్ననాటి మిత్రుడు కూడా. అయితే పెళ్లి తర్వాత సానియా క్రీడా భవిష్యత్తు నేపథ్యంలోనే నిశ్చితార్థం రద్దయినట్లు తెలుస్తోంది.