రాహుల్ పై మరోసారి థాకరే మండిపాటు

మంగళవారం, ఫిబ్రవరి 9, 2010, 11:38 [IST]
Bal Thackeray
ముంబై: కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీపై శివసేన చీఫ్ బాల్ థాకరే మరోసారి మండిపడ్డారు. ఇటీవలి పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ ముంబైని బొంబాయి అనడాన్ని ఆయన మంగళవారం వ్యతిరేకించారు. తన ప్రసంగంలో రాహుల్ ముంబైని పదే పదే బొంబాయి అన్నారని, ముంబైని మహారాష్ట్ర నుంచి విడదీయాలనుకునే వారే అలా అంటారని ఆయన తన సామ్నా పత్రిక సంపాదకీయంలో అన్నారు.
  Read:  In English 
రాహుల్ గాంధీ ముంబై పర్యటన మహారాష్ట్ర ప్రజలతో తీసిన కాంగ్రెసు అంతిమ యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మంత్రి రాహుల్ గాంధీ చెప్పులు మోయడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతగా దిగజారడానికి ఆ మంత్రికి సిగ్గుండాలని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ కాడని, అందువల్ల రాహుల్ చెప్పులను హృదయానికి హత్తుకోవడంలో అర్థం లేదని ఆయన అన్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets