ఇప్పుడు మీ మొబైల్ లో తెలుగులో టైప్ చేసుకోవచ్చు

శుక్రవారం, ఫిబ్రవరి 19, 2010, 15:53 [IST]
Now, type regional languages on mobiles
బెంగళూరు: ఇంగ్లీషు రాని మొబైల్ వినియోగదారులు భారత్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇటువంటి వారి ఉపయోగం కోసం ఒక భారతీయ కంపెనీ పాణిని కీబోర్డును రూపొందించింది. 50 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్న ఇండియాలో అనేక ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ప్రాంతీయ భాషలు మాత్రమే తెలిసిన మొబైల్ వినియోగదారులకు ఈ కీప్యాడ్ నిజంగా వరప్రసాదం వంటిదే.

ఈ కొత్త టెక్నాలజీని వినియోగదారులు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారతీయ భాషలైన హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒరియా, అస్సామీస్ భాషల్లో ఈ టెక్నాలజీ ద్వారా ఎస్ ఎం ఎస్ లు పంపుకోవచ్చు. మొబైల్ కీ ప్యాడ్ పైన ఈ ప్రాంతీయ భాషా అక్షరాలు ఉండవల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద అక్షరాలు కన్పిస్తాయి. అంకెల కీ బోర్డును వాడి ఆ అక్షరాలను టైప్ చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీని పిసిలకు, వెబ్ కు, టచ్ స్క్రీన్ కియోస్కలకు, ఎస్ టిబి, ఐపిటివిలకు వర్తింపజేసుకోవచ్చు. పెద్దగా చదువుకోని వారైనా కొన్ని నిముషాల్లోనే ఈ టెక్నాలజీని ఎలా ఉంపయోగించాలో తెలుసుకోగలుగుతారు. ప్రస్తుతానికి ఈ సాఫ్ట్ వేర్ ను నోకియా జావా ఫోన్ పై ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇతర ఫోన్లకు ఈ సదుపాయం త్వరలో వస్తుంది. అరేబిక్, రష్యన్, హిబ్రూ భాషల్లోకి ఇప్పటికే ఈ టెక్నాలజీ వచ్చింది.
User Comments
శ్రీనివాస్ 19 Feb 2010 04:57 pm
inta information ichhaaru baagaane undi kaani alaage aa link kuda iste download chesukoni taristaamu kada?
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets