హైదరాబాద్ లో ఫేస్ బుక్ కార్యకలాపాలు

బుదవారం, మార్చ్ 17, 2010, 14:25 [IST]
Facebook to begin hiring in Hyderbad
హైదరాబాద్: పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తన కార్యకలాపాలను హైదరాబాదులో కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇందుకు గాను భారత్ లో హెడ్ కోసం అన్వేషిస్తోంది. ఇండియా టీంను ఏర్పాటు చేసుకోగలిగే అధిపతి కోసం ఫేస్ బుక్ అన్వేషిస్తోంది. అంతేకాకుండా స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగిన వారి కోసం చూస్తోంది. వీరిలో ఆన్ లైన్ సేల్స్ మేనేజర్స్, ఐటి సెక్యూరిటీ హెడ్స్ ఉంటారు. ఈ నియామకాల ప్రక్రియ కొద్ది వారాల్లో ప్రారంభమవుతుంది.
  Read:  In English 
ఇండియా హెడ్ కోసం సివిలను స్కాన్ చేస్తున్నట్లు ఈ నెల 16వ తేదీన భారత్ వచ్చిన కంపెనీ గ్లోబల్ ఆన్ లైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ డాన్ ఫౌల్ చెప్పారు. హైదరాబాద్ లో చాలా చిన్నగా ప్రారంభించాలని అనుకుంటున్నట్లు, ఒక హెడ్ ను నియమించుకుని ముందుకు సాగాలని చూస్తున్నామని ఆయన అన్నారు. ఆ పదవి కోసం బలమైన కన్జ్యూమర్ ఇంటర్నెట్ అనుభవంపై అవగాహన ఉన్న వ్యక్తి కావాలని అన్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets