
న్యూఢిల్లీ: పితృత్వవాద కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రోహిత్ శేఖర్ వేసిన పిటిషన్ ను కొట్టేయాలని కోరుతూ ఎన్డీ తివారీ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్డీ తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ వేసిన దావాపై విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Read: In English
ఉజ్వల్ అనే కాంగ్రెసు నాయకురాలి కుమారుడ్ రోహిత్ శేఖర్ తన బయోలాజికల్ తండ్రి తివారీయేనని, తాను తివారీకే పుట్టానని అంటూ కోర్టులో దావా వేశాడు. దీన్ని రుజువు చేసుకోవడానికి డిఎన్ఎ పరీక్షలు జరిపించాలని అతను కోర్టును కోరుతున్నాడు.
















