
కోల్ కత్తా: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నిషేధిత మావోయిస్టులు తెగబడ్డారు. రెండు రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగారు. గ్రీన్ హంట్ కు నిరసనగా, తమ నేతల ఎన్ కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఆరు రాష్ట్రాల్లో తలపెట్టిన 48 గంటల బంద్ సోమవారం ప్రారంభమైంది. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు.
Read: In English
బంద్ సందర్భంగా మావోయిస్టులు వశ్చిమ బెంగాల్ లోని పశ్సిమ మిడ్నాపూర్ జిల్లాలో మిడ్నాపూర్ - గుడియప్ప షోలా రైల్వై ట్రాక్ ను మావోయిస్టులు పేల్చేశారు. అలాగే జార్ఖండ్ లోని ముసాబోని, దుమారియాల మధ్య గల వంతెనను వారు మందుపాతరతో పేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో తమ నాయకుడు శాఖమూరి అప్పారావును పోలీసులు కిరాతకంగా హత్య చేసి ఎన్ కౌంటర్ గా చిత్రీకరించారని మావోయిస్టు నేత కిషన్ జీ ఆరోపించారు.




















