ఒఎంసికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సోమవారం, మార్చ్ 22, 2010, 13:50 [IST]
Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ఒఎంసికి చెందిన ఆరు గనుల రీసర్వేకు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ రీసర్వే పూర్తయ్యే వరకు తవ్వకాలు ఆపేయాలని కూడా ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. సర్వే ఆఫ్ ఇండియా, ఒఎంసి ప్రతినిధుల ఆధ్వర్యంలో గనుల సరిహద్దులపై సర్వే జరిపి మూడు వారాల్లోగా నివేదికలు అందజేయాలని ఆదేశించింది.
  Read:  In English 
సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందంలో రాష్ట్ర అడవులు, పర్యావరణ, గనులు, రెవెన్యూ మంత్రిత్వ శాఖల అధికారులుండాలని కూడా సూచించింది. ఈ నెల 26వ తేదీ నుంచి రీసర్వే ప్రారంభించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా తాత్కాలిక నివేదికలు అందించాలని సుప్రీంకోర్టు గనుల యాజమాన్యాన్ని ఆదేశించింది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets