వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టు మేధావి శరత్ అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
రంపచోడవరం: మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్య రూపకల్పనలో కీలకపాత్ర పో షిస్తున్న ఎల్‌.సత్యనారాయణమూర్తి అలియాస్‌ శరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ వై.నాగిరెడ్డి మంగళవారం శరత్‌ను రంపచోడవరంలో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. బంద్‌ సందర్భంగా రంపచోడవరంలో సోమవారం రాత్రి ఏపీ 10 జెడ్‌ 6115 నంబరు ఆర్టీసీ బస్సులో జరిపిన తనిఖీల్లో శరత్‌ పట్టుబడ్డారని చెప్పారు. ఆయనపై రూ.10 లక్షల రివార్డు ఉందన్నారు. పోలీసులు అనుమానంతో బస్సును చుట్టుముట్టిన వెంటనే ఆయన 'సీపీఐ మావోయిస్టు పార్టీ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేశారన్నారు.

అదుపులోకి తీసుకుని విచారించగా ఉద్యమ సాహిత్య విభాగానికి చెందిన కీలక వ్యక్తిగా తేలిందన్నారు. ఢిల్లీ, చెన్నైల్లో ఉంటూ మావోయిస్టు పత్రిక 'క్రాంతి'కి సాహిత్యాన్ని సమకూర్చడం, ఇతర విప్లవ సాహిత్యాలను అనువదించడం వంటి పనులను శరత్‌ నిర్వహిస్తుంటారని చెప్పారు. ఆయన నుంచి ల్యాప్‌టాప్‌ కంప్యూటర్‌, పెన్‌డ్రైవ్‌, కెమెరా, డ్రైవింగ్‌ లైసెన్సు, చెన్నైలో నివాసముంటున్నట్టు ఓటరు గుర్తింపుకార్డు, మూడు మొబైల్‌ఫోన్లు, టాటా ఇండికామ్‌ ఇంటర్నెట్‌ డేటాకార్డు, మావోయిస్టు నాయకులు రాసిన పలు ఉత్తరాలు, వివిధ నాయకుల చిరునామాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

శరత్‌ గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యులు. 1972లో శరత్‌ కొండపల్లి సీతారామయ్యతో పరిచయం పెంచుకుని అప్పటి సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ సెంట్రల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీలో చేరారు. 1977లో వార్‌ రాష్ట్ర కమిటీ పత్రిక 'క్రాంతి' ప్రారంభించారు. గద్దర్‌, వరవరరావు, చెరబండరాజు, బి.నరసింగరావు తదితర కీలక వ్యక్తులతో సంబంధాలు నెరిపారు. 1981 నుంచీ 1984 మధ్యకాలంలో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ, నల్లా ఆదిరెడ్డి, ముప్పాళ్ల లకణరావు అలియాస్‌ గణపతి, యర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి అలియాస్‌ మహేష్‌ వంటి నాయకుల నేతృత్వంలో 'క్రాంతి' పత్రికను శరత్‌ కొనసాగించారు.

1980లో వివాహం చేసుకున్న శరత్‌ ఆరునెలల్లోనే భార్యను విడిచి విప్లవానికి అంకితమయ్యారు. 1984లో పీపుల్స్‌వార్‌ అజ్ఞాతదళంలో చేరారు. న్యూఢిల్లీలోను, చెన్నైలోను స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగించారు. 1986లో పీపుల్స్‌వార్‌ నేత ఐ.వి.సాంబశివరావు చనిపోయిన తర్వాత దండకారణ్యానికి వచ్చి 'ప్రభాత్‌' అనే పార్టీ పత్రికను నడిపించారు. 2001లో అబూజ్‌మడ్‌లో జరిగిన కీలక జాతీయ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. 2004లో పీపుల్స్‌వార్‌ అగ్రనేత ముప్పాళ్ల లకణరావు అలియాస్‌ గణపతి ఆధ్వర్యంలో బీహార్‌లో జరిగిన సెంట్రల్‌ కమిటీ సమావేశానికి కూడా రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. 2007లో న్యూఢిల్లీ వెళ్లి కోబాడ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు. 2008లో అనారోగ్య కారణాల వల్ల తన కార్యకలాపాల్ని న్యూఢిల్లీ నుంచి మార్చవలసిందిగా కోరుతూ గణపతికి లేఖ రాశారు. 2007లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డిపై జరిగిన దాడి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలకు శరత్‌ వ్యూహకర్త.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X